అమరావతి: ఓ అధికారి అశ్లీల చిత్రాలు తీసి వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టు చేయడంతో కలకలం సృష్టించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో ఓ వ్యక్తి సిటీ మిషన్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మెప్మా వాట్సాప్ గ్రూపులలో ఓ మహిళా అశ్లీల చిత్రాలు పోస్టు చేశాడు. తోటి ఉద్యోగులు అశ్లీల చిత్రాలు చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎపి మెప్మా ఎండి తేజ్ భరత్‌తో కలిసి సిబ్బంది జిల్లా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. వెంటనే సిటీ మిషన్ మేనేజర్‌ను పొన్నూరుకు బదిలి చేశారు.
అక్కడ విధుల్లో చేరకుండానే మళ్లీ గుంటూరుకే పోస్టింగ్ వేయించుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉండడంతోనే మళ్లీ పోస్టింగ్ గూంటురుకు మార్చుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎపి ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక హోదాలో ఉండి ఇలాంటివి చేయడం సరికాదని, ఆఫీసర్ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఎలా ఉంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.