Thursday, August 21, 2025

అనుమానస్పదస్థితిలో మహిళా రిమాండ్ ఖైదీ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ మహిళ అనుమస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. నర్సంపేట ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన పెండ్యాల సుచరిత హన్మకొండలో కొనేళ్లుగా నివాసం ఉంటుంది. కాగా ఓ కేసులో నిందితురాలిగా ఉన్న పెండ్యాల సుచరితను సుబేదారి పోలీసులు అరెస్టు చేసి ఈనెల 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. కాగా సబ్ జైలులో ఉన్న సుచరిత మంగళవారం అస్వస్థతకు గురి కాగా వెంటనే గుర్తించిన జైలర్ స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అనంతరం మళ్లీ సబ్ జైలుకు తరలించారు.

బుధవారం ఉదయం అస్వస్థతకు గురికాగా గుర్తించిన జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు సబ్ జైలర్ లక్ష్మీశృతి ఫిర్యాదు మేరకు నర్సంపేట ఎస్సై రవికుమార్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా ఖైదీ మృతికి గల పూర్తి కారణాలు పోస్టుమార్టం అనంతరమే తెలుస్తుందని ఎస్సై తెలిపారు. ఈ విషయమై సబ్ జైలర్ లక్ష్మీశృతి మాట్లాడుతూ.. మంగళవారం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొంది మళ్లీ వచ్చిన తరువాత భాగానే ఉండి బుధవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురైందని తాను వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆ మహిళా ఖైదీకి మృతికి సంబంధించి శవ పరీక్షల అనంతరమే ఎలాంటి అనారోగ్యంతో చనిపోయిందనేది తెలుస్తుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News