Tuesday, August 12, 2025

లంచం.. ఎసిబికి చిక్కిన మహిళా రెవెన్యూ ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అవీనితి నిరోధక శాఖ(ఎసిబి).. లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ కేసులు నమోదు చేస్తున్నా.. వారు మారడం లేదు. దీంతో ప్రతిరోజు ఎక్కడో ఒక్కచోట లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఎసిబికి పట్టుబడుతున్నారు. తాజాగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎసిబి అధికారులకు చిక్కారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపేందుకు, కలెక్టరేట్ కార్యాలయ మహిళా రెవెన్యూ ఉద్యోగి సుజాత రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఎసిబి పట్టుకుంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో డిఏ బిల్లులు చేసేందుకు బాధితుడి నుండి రూ.6,000 లంచం తీసుకుంటూ పిహెచ్‌సి ఇన్‌చార్జ్ గడియారం శ్రీనివాసులు ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News