Thursday, July 24, 2025

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.45 కోట్లు

- Advertisement -
- Advertisement -

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 41 రోజు హుండీ ఆదాయం రూ.2,45,48,023 వచ్చినట్లు ఆలయ ఇఒ వెంకట్రావు తెలిపారు. బుధవారం కొండ కింద గల వ్రత మండపంలో హుండీ లెక్కింపు జరిగిందని తెలిపారు. నగదుతో పాటు 38 గ్రాముల బంగారం, రెండు కిలోల 800 గ్రాముల వెండిని భక్తులు హుండీలో సమర్పించినట్లు తెలిపారు. 1,036 అమెరికన్ డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 45 ఇంగ్లాండ్ పౌండ్స్, 5 సౌదీ అరేబియా రియాన్లు, 10 సింగపూర్ డాలర్లు, 1/2 ఖతార్ రియల్ , 500 ఒమన్ బైస, 70 అరబ్ ఎమిరేట్స్ థీరమ్స్, శ్రీలంక 500, 23 మలేషియా రింగిట్స్, 20 కెనడా డాలర్లు, 2 బెహ్రిన్ వచ్చినట్లు తెలిపారు.

స్వామివారి నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.9,40,122 వచ్చినట్లు ఆలయ ఇఒ తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.64,600, బ్రేక్ దర్శనం ద్వారా రూ.69,300, విఐపి దర్శనం ద్వారా రూ.90,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.1,55,000, సువర్ణపుష్పార్చన రూ.23,832, ప్రసాద విక్రయం ద్వారా రూ.4,34,210, కల్యాణకట్ట ద్వారా రూ.17,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

శ్రీవారి సేవలో మురళీమోహన్..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News