హైదరాబాద్: టాలీవుడ్‌లో వారం రోజులుగా సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు.కృష్ణానగర్‌లో ఇవాళ సినీ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు మీడియాతో మాట్లాడారు. కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పు అని ఫిల్మ్ పెడరేషన్ తెలిపింది. ఇకపై ఏ షూటింగ్స్ జరగవని, నిర్మాత విశ్వప్రసాద్ తమకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదని, తాము ఛాంబర్‌తో మాత్రమే మాట్లాడతామని, పీపుల్స్ మీడియా తమకు రూ. 90 లక్షల బకాయి ఉందని వివరించారు. స్కిల్ లేదని ఎలా అంటారని, తాము ఒత్తిడి చేయడం లేదని సినీ కార్మికులను గుర్తించాలని పిలుపునిచ్చారు. వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేస్తారా అని, వచ్చే ఆదాయంలో తాము వాటాలు అడగట్లేదని చురకలంటించారు. మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా గుర్తించడం లేదని, ఛాంబర్‌తో చర్చలు జరపాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారని, చిరంజీవి తమతో టచ్ లోనే ఉన్నారని ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారని పేర్కొంది.
కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతామనడం తప్పు: ఫిల్మ్ ఫెడరేషన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -