Thursday, September 18, 2025

హలీవుడ్ స్థాయికి హైదరాబాద్‌

- Advertisement -
- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో సిఎం భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని చెప్పాలన్నారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెపినట్లు సిఎం వెల్లడించారు. సినిమా కార్మికులలో నైపుణ్యాలు పెంపొందించేందుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరానన్నారు. సిల్క్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తామని సిఎం తెలిపారు. సినిమా కార్మికులు నైపుణ్యాలు పెంపోందించుకోవాలని, అన్ని బాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలని సిఎం కోరారు. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలని, పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దని సిఎం సూచించారు.

సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుతుందని, సమస్యను సమస్యగానే చూస్తానని, వ్యక్తిగత పరిచయాలను చూసుకోనని సిఎం స్పష్టం చేశారు. సినిమా కార్మికుల తరపున ప్రభుత్వం నిర్మాతలతో చర్యలు జరుపుతుందని సిఎం వెల్లడించారు. ఈ ప్రభత్వం మీదని, సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదని సిఎం హామీ ఇచ్చారు. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, దీంతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిచడంలో కార్మికుల పక్షాని నిలుస్తానని సిఎం పేర్కొన్నారు. సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందచేసే ప్రయత్నం చేస్తామని, సినీ కళాకారులకు గద్దర్ అవార్డులు ఇచ్చినట్లు సిఎం గుర్తు చేశారు. పది సంవత్సరాల పాటు సినిమావాళ్లకు అవార్డులు కూడా ఇవ్వలేదని సిఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాసుమిల్లి అమ్మిరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: హైదరాబాద్‌లో ఐటి దాడుల కలకలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News