Sunday, August 10, 2025

కృష్ణానగర్‌లో కొనసాగుతన్న సినీ కార్మికుల నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్‌లో వారం రోజులుగా సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కృష్ణానగర్‌లో ఇవాళ సినీ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో 24 యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు. టిజి విశ్వప్రసాద్ తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఫెడరేషన్ ప్రకటించనుంది. నిర్మాతలు సూచించిన పర్సెంటేజీ విధానాన్ని ఫెడరేషన్ అంగీకరించలేదు. యూనియన్లను నిర్మాతలు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపణ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News