Saturday, July 26, 2025

నిరుపేద యువతి పెళ్లికి అండగా దుబ్బాక..

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి: మండలంలోని గోపాల్‌రావుపల్లె గ్రామానికి చెందిన నిరుపేద యువతి పెళ్లికి సామాజిక సేవా కార్యకర్త దుబ్బాక రమేష అండగా నిలిచారు. గ్రామానికి చెందిన ములిగె జ్యోతి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో సోదరుడు రాజు సాయంతో డిగ్రీ వరకు చదువుకున్నది. ఇటీవల వివాహం కుదరడంతో విషయం తెలుసుకున్న దుబ్బాక రమేష్ రూ.5వేల నగదు, క్వింటాళ్ బియ్యాన్ని తనవంతు సాయంగా అందజేశారు. ఎవరైనా దాతలుంటే వారికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసరి బాలరాజు, దుబ్బాక శ్రీనివాస్, మిరాల శ్రీనివాస్, మహిపాల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News