Wednesday, September 10, 2025

కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో పురుగుల భోజనం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహంలో వడ్డించిన భోజనంలో బుధవారం పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందులో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. రిజిస్టర్, వంటగదిని పరిశీలించి గోదామును తనిఖీ చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. హాస్టల్ నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని జిసిసి డిఒ ఉదయ్‌శ్రీని ఆదేశించారు. వారానికి ఒకసారి పాఠశాలలో తనిఖీ చేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజలింగం, మండల విద్యాధికారి పవర్ అనిత ఉన్నారు. కాగా కస్తూర్బా పాఠశాలల విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆదివాసీ సంఘాలు సంఘటనా స్థలాన్ని సందర్శించి, మీడియాతో మాట్లాడారు. హాస్టల్‌లో సరైన వసతులు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు హాస్టల్‌ను సందర్శించి నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు రావడంతో అందుకు బాధ్యతగా జిసిసి డిఇఒను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News