Wednesday, April 30, 2025

ఢిల్లీ ఉప్‌హార్ సినిమా హాల్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident at Delhi Uphaar Cinema Hall

న్యూఢిల్లీ : ఢిల్లీ గ్రీన్‌పార్క్ ప్రాంతం లోని ప్రముఖ ధియేటర్ ఉప్‌హార్ సినిమా హాల్‌లో ఆదివారం తెల్లవారు జామున 4.45 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. థియేటర్ లోని బాల్కనీ, కింది ఫ్లోర్‌లో ఉన్న సీట్లన్నీ కాలిబూడిదయ్యాయి. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఉదయం 7.20 గంటలకు అదుపులోకి తెచ్చినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇదే థియేటర్‌లో 1997 జూన్ 13న భారీ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 59 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తరువాత ఈ థియేటర్‌ను ఇంతవరకు తెరవలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News