హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోల్ మసీదు దగ్గరలో మూడు అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం ఇస్తున్నాయి. బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా అందులో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు. భారీ ల్యాడర్ ద్వారా అందులో చిక్కుకున్న రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రామిస్తున్నారు.. సమీపంలో దుకాణాలకు మంటలు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గోల్ మసీదు ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.