Saturday, August 16, 2025

“బాంబే డయింగ్” బట్టల షోరూమ్ లో అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రాంతం బీసెంట్ రోడ్డులో “బాంబే డయింగ్” బట్టల షోరూమ్ లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7:12 నిమిషాల సమయంలో షోరూమ్ నుంచి పొగలు రావడం ఎపిజెఎ జర్నలిస్టు యూనియన్ సెక్రటరీ పూర్ణ గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆరు నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ముందుగా పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పిందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఆస్తి నష్టంతో పాటు చుట్టు పక్కల నివాస ప్రాంతాలు ఉన్నాయని, ప్రాణ నష్టానికి నివారించారని కొనియాడారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు పూర్ణను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News