- Advertisement -
నోయిడా: నోయిడా సెక్టార్ 8లోని ఒక రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీ ఆవరణ నుండి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఎగసిపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురియ్యారు. భారీగా మంటలు చెలరేగుతుండటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక దళాలు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన కార్మికులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -