Monday, May 19, 2025

సోలాపూర్ జౌళి మిల్లులో అగ్నిప్రమాదం..ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని జౌళి మిల్లులో ఆదివారం తెల్లవారు జామున 3.45 గంటలకు ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో యజమాని సహా ఎనిమిది మంది అసువులు బాసారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్కూటే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం ఎనిమిది మరణించారని సమాచారం. మిల్లు యజమాని హాజీ ఉస్మాన్ హసన్‌భాయ్ మన్సూరీ, ఆయన ఒకటిన్నర ఏళ్ల మనవడు సహా ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, నలుగురు కార్మికులు మృతి చెందారని తెలిసింది. మంటలు భారీగా చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు దాదాపు ఐదారు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News