Friday, July 11, 2025

రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్ర్కాప్ గోదాంలో ఈరోజు(గురువారం) ఉదయం అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.  పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News