Tuesday, August 26, 2025

ఆర్‌టిసి బస్సులో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసి బస్సులో మంటలు చెలరేగిన సంఘటన మెహిదీపట్నంలో మంగళవారం చోటుచేసుకుంది. మెహిదీపట్నం ఆర్‌టిసి డిపోకు చెందిన బస్సు లింగంపల్లికి వెళ్లి తిరిగి మెహిదీపట్నం బస్టాప్ వద్దకు వచ్చింది. బస్టాప్ వద్దకు రాగానే బస్సు ఆగిపోయింది. ప్రయాణికులను అప్పటికే బస్సులో నుంచి కిందికి దింపాడు. బస్సును రోడ్డుపక్కన ఆపేసిన డ్రైవర్ తిరిగి స్టార్ట్ చేసేందుకు బానెట్ ఓపెన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ కిందికి దిగగానే మంటలు ఎక్కువయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు ముందుభాగం పూర్తిగా దగ్దమైంది. సంఘటన స్థలానికి చెరుకున్న మెహిదీపట్నం డిపో మేనేజర్, మెకానిక్ విభాగం సిబ్బంది ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News