- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి ప్రాంతం బాలాజీ నగర్ లో శనివారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాల మెకానిక్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలోని బ్యాటరీలు, మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
- Advertisement -