Wednesday, August 20, 2025

దేశం గర్వపడే సినిమా

- Advertisement -
- Advertisement -

వీర జవాన్ (veera jawan) మురళి నాయక్  దేశానికి గర్వకారణం. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నాం. ఇది దేశం గర్వపడే సినిమా అవుతుంది”అని అన్నారు హీరో గౌతమ్ కృష్ణ. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కె.సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాని ప్రకటించారు. ఈ సమావేశంలో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ “ఇది ఒక రియల్ హీరో కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఇప్పటివరకు ఒక్క తెలుగు సైనికుడు మీద కూడా బయోపిక్ రాలేదు. తెలుగు సైనికుడి మీద వస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇది.

ఆపరేషన్ సింధూర్ మన దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం. అలాంటి ఒక వార్‌లో పాల్గొని వీరమరణం పొందిన మురళి నాయక్ కథ (Murali Nayak story) ప్రపంచానికి తెలియాలి. ఇది ఒక కేవలం సినిమా మాత్రమే కాదు. దేశం గర్వపడే ఒక భావోద్వేగం”అని అన్నారు. నిర్మాత కె.సురేష్ బాబు మాట్లాడుతూ “మురళి నాయక్ జీవితం అందరికీ ప్రేరణనిస్తుంది. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ కథ, ఈ సినిమా అందరూ గర్వపడేలా ఉంటుంది”అని తెలిపారు. మురళి నా యక్ తల్లితండ్రులు మాట్లాడుతూ “మురళి పాత్రలో గౌతం బాబుని చూడడం మురళి తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సినిమా పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాము”అని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News