అందాల తార త్రిష ఒక దశలో కెరీర్ ముగుస్తుందన్న సమయంలో హిట్ సినిమాల్లో నటించి మరోసారి స్టార్ స్టేటస్ అందుకుంది. ఒకప్పుడు నటించిన స్టార్ హీరోలందరితో మళ్లీ సినిమాలు చేస్తోంది. చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, విజయ్.. ఇలా స్టార్స్ అందరితో మళ్లీ నటిస్తున్న త్రిష.. కెరీర్ ప్రారంభంలో తన మానసిక స్థితిని బయటపెట్టింది. అందాల పోటీల్లో పాల్గొంటున్న సమయంలో, యాడ్స్ కూడా చేస్తున్న సమయంలో త్రిషకు సినిమా ఛాన్స్ వచ్చిందట.
అగ్రిమెంట్‌లో సంతకం పెట్టే ముందు, సినిమా సరిగ్గా ఆడకపోతే తనను ఏమీ అనకూడదని, సినిమాలు వదిలేసి చదువుకుంటానని తల్లి ముందు కండిషన్ పెట్టిందంట త్రిష. ఆ కండిషన్ కు తల్లి అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్ పై సంతకం చేసిందట. ఒకవేళ మొదటి సినిమా సరిగ్గా ఆడకపోతే ఈపాటికి సైకాలజిస్ట్ అయ్యేదాన్నని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం విశ్వంభర జూలైలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమెకిది రెండో చిత్రం. ఇంతకుముందు స్టాలిన్ చిత్రంలో నటించింది.