Wednesday, September 10, 2025

రెండు దశల్లో జనగణన

- Advertisement -
- Advertisement -

జనగణనతోపాటే కులగణన కేంద్రం ప్రకటన
2026 అక్టోబర్‌లో మంచు కురిసే ప్రాంతాల్లో గణన
2027లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహణ
16ఏళ్ల తరువాత తొలిసారిగా జరుగుతున్న జనగణన
1881 తరువాత కులగణన చేపట్టడం ఇదే తొలిసారి

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన దేశ జన గణన బృహత్తర కార్యక్రమ ఆరంభ ప్రకటన వెలువరించింది. భారతదేశ 16వ జ నాభా లెక్కలు (సెన్సస్) ఈసారి కులాల వారి జనాభా లెక్కింపులతో పా టు చేపడుతారని బుధవారం నాటి అధికారిక ప్రకటనలో తెలిపారు. 20 27 జనవరి 1 నుంచి ఈ ప్రక్రియ చేపడుతారని వివరించారు. ఇక ఈ జనగణనకు పేర్ల నమోదు సంబంధిత రెఫరెన్స్ తేదీని 2026 అక్టోబర్ 1గా ఖరారు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంలో జనగణన అందులోనూ ఈసారి కులాల వారిగా లెక్కింపు అనేది అత్యంత కిలక పరిణామం కానుంది. రెండు దశల్లో ఈ కార్యక్రమం సాగుతుంది. మంచు ఎక్కువగా కురిసే లద్థాక్ ఇతర ప్రాంతాలలో ఈ జనాభా లెక్కల కార్యక్రమాన్ని 2027 మార్చి 1 నుంచి వేసవి కాల ఆరంభ దశలో చేపడుతారని ప్రకటనలో తెలిపారు. 2011 తరువాత 16 సంవత్సరాలకు ఈ సెన్సస్ జరుగుతుంది. కులగణనకు 30 లక్షలకు పైగా గణాంక కర్తలు ఎన్యూమరేటర్స్ విధుల్లోకి దిగుతారు. వారికి సూపర్‌వైజర్లు కూడా ఉంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇళ్ల వరకూ వెళ్లి జనాభాలెక్కలకు దిగడం, ఇందులో భాగంగానే ఈసారి కొత్తగా ఎవరెవరు ఏ కులానికి చెందిన వారు? అనే వివరాలను సేకరించడం అత్యంత సంక్లిష్టమైన అత్యంత శ్రమతో కూడిన కార్యక్రమం కానుంది. కులగణన వల్ల కులాలలో ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి విశ్లేషించుకునేందుకు వీలేర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచుకురిసే ప్రాంతాల్లోనూ రెండో దశలో సెన్సస్ సాగుతుంది.

1881 తరువాత ఇదే తొలి కుల ప్రాతిపదిక జనగణన
భారతదేశంలో సమగ్ర కులాల వారి జనాభా లెక్కల ప్రక్రియ బ్రిటిష్ వారి హయాంలో 1881 నుంచి 1931 మధ్యకాలంలో సుదీర్ఘంగా సాగింది. అప్పటికి జనాభా తక్కువనే. ఇక యుపిఎ ప్రభుత్వం 2011లో బలాల వారిగా సామాజిక ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన కుల గణన ’ఎస్‌ఇసిసి) ని నిర్వహించింది.అప్పుడు కులాలవారి కీలక సమాచారం సేకరించారు. అయితే తెలియని రాజకీయ కారణాలతో ఈ వివరాలను వెలుగులోకి తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో కులాల ప్రాతిపదికన జనాభా లెక్కల సేకరణ జరగాల్సిందేనని, అప్పుడే బడుగు వర్గాల ఆర్థిక సామాజిక, రాజకీయ స్థితిగతులు తెలిసి వస్తాయని పేర్కొంటూ వస్తోంది. ఇటీవలే ప్రధాని మోడీ ఈ డిమాండ్‌తో నిమిత్తం లేకుండానే దేశంలో కులాల జనగణన ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు.

తెలంగాణ, బీహార్‌లో మూడేళ్ల క్రితమే ఈ ప్రక్రియ
కులాల వారి జనగణన ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం, బీహార్‌లలో గత మూడేళ్లలోనే పూర్తి చేశారు. అయితే ఇది జాతీయ దృక్పథ అంశం కావడంతో ఈ సమగ్ర నివేదిక అధికారికంగా వెలుగులోకి రాలేదు. .సెన్సస్ సంబంధిత నోటిఫికేషన్ , రెఫరెన్స్ తేదీలను దాదాపుగా ఈ నెల 16 వ తేదీన వెలువరించే గెజిట్ ద్వారా ప్రకటిస్తారు. 1948 నాటి సెన్సస్ యాక్ట్ సెక్షన్ 3 నిబంధనల పరిధిలో ఈ గెజిట్ విడుదల అవుతుందని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. రాజ్యాంగ నియమావళి ప్రకారం దేశ జనాభా గణన అది ఏ రూపంలో సాగినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. సెవెన్త్ షెడ్యూల్‌లోని యూనియన్ లిస్ట్ 69 వ నిబంధన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రాలు ఇప్పటివరకూ చేపట్టిన రాష్ట్రాలవారి జనగణనలు కేవలం రాజకీయ కోణాలతో , సమాజంలో అపోహలు సందేహాల కల్పనకు ఉద్ధేశించినవే అ

ని ఇవి అనధికారికం అని , పారదర్శకత లోపించినవి అని పైగా పలు హెచ్చుతగ్గులతో అసమగ్రరీతిలో సాగించినవే అని కేంద్రం బుధవారంనాటి ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఎప్రిల్ 30వ తేదీన ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలోనే ఈసారి జనాభా గణనలో కులాల వారి జన గణన ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఈ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే బీహార్, బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మోడీ సర్కారు ఈ ప్రక్రియకు దిగిందని కాంగ్రెస్ విమర్శించింది. కుల జనగణన తమ విజయం అని పేర్కొంటోంది. ఇక సామాన్యుడు అయితే ఎటువంటి కులగణన జరిగినా జరగకపోయినా తమ బతుకులు కథ వ్యథ ఇంతే అని వాపోతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News