- Advertisement -
సైదాబాద్ బాలల సంక్షేమ, సంస్కరణల(జువైనల్ హోం) శాఖ నుంచి ఐదుగురు బాలలు పరారయ్యారు. ఈ నెల 22న రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. వీరందరూ 16, 17 మధ్య వయస్సు ఉన్నావారే. అందులో ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా, మిగితా ముగ్గురు తెలంగాణకు చెందిన వారు. వివిధ నేరాలల్లో ఇద్దరూ ఆరు నెలల క్రితం, ముగ్గురు రెండు నెలల క్రితం జైలుకు వచ్చిన బాలలు. రాత్రి భోజన సమయంలో సిబ్బంది కళ్లు గప్పి మొదటి అంతస్తుకి చేరుకుని తాళం విరగొట్టి పై నుంచి దూకి పారిపోయారు. బాలల పరారీ పై జువైనల్ అధికారులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -