- Advertisement -
తమిళనాడు లోని శివగంగ జిల్లా మల్లకొట్టాయ్ లోని ఓ ప్రైవేట్ రాళ్ల క్వారీలో మంగళవారం అకస్మాత్తుగా రాళ్లు కూలి ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మురుగనందం, ఆరుముగం, గణేశన్, ఆండిచామి, తమిళనాడుకు చెందిన వారు కాగా, హర్షిత్ ఒడిసాకు చెందిన వాడు. గాయపడిన వారిని మదురై ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున, గాయపడిన వారికి రూ. లక్ష వంతున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. శిథిలాల్లో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు, ఫైర్, సహాయ బృందాలు బయటకు తీశారు.
- Advertisement -