Monday, May 5, 2025

కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చమన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా, సమీపంలోని భవనాలను ఖాళీ చేయించారు.

అనంతరం 12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. లోపల చిక్కుకున్న ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిని బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. కాగా, భవనంలో అక్రమ షూ తయారీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News