Friday, July 18, 2025

అస్సాంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అస్సాంలో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి ఆరు జిల్లాల్లో వరదలు చోటుచేసుకున్నాయి. 10వేలకు పైగా జనులు ప్రభావితం అయ్యారు. కాగా కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు. అయితే ఆ ఐదుగురు కామ్‌రూప్‌కు చెందిన వారేనని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఎఎస్‌డిఎంఎ) తెలిపింది. రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో ఉన్న మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పైనున్న అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయలో కురిసిన వర్షం నీరు కూడా ప్రవహించడంతో అస్సాంలో వరద తీవ్రత మరింత పెరిగింది.

నీళ్లలో మునిగిన ప్రదేశాల్లో అనేక సంస్థలు బాధితులకు సాయం అందిస్తున్నాయని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్ల బారువా తెలిపారు. అస్సాంలోని కామ్‌రూప్, కచర్, ధేమాజీ, లఖింపుర్, గోలాఘట్ లను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదుల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. లఖింపుర్‌లోని దిబ్రుగఢ్, రంగనది, జియా భరలీ, కోపిలి బేకిలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రాష్ట్రం అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. గౌహతి విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News