కర్నాటకలో అదుపు తప్పి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును
ఢీకొన్న కారు గద్వాలకు
చెందిన ఐదుగురు మృతి
మృతుల్లో నలుగురు ఒకే
కుటుంబానికి చెందిన వారు
హయత్‌నగర్ సమీపంలో
డిసిఎంను ఢీకొన్న కారు
ముగ్గురు యువకుల దుర్మరణం,
ఒకరికి తీవ్ర గాయాలు
మన తెలంగాణ / గద్వాల ప్రతినిధి :కర్ణాకట రాష్ట్రం విజయపుర జిల్లా మనగూలి సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం లో ఐదుగురు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల టౌన్ బీసీ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన భా స్కర్(40) భార్య పవిత్ర(38) కొడు కు అభిరా మ్(12), కూతురు జ్యోష్ణ(14) మృతి చెందా రు. కారు డ్రైవర్ కూడా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరొక బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాల మేరకు గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన భాస్కర్ కెనరా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నారు. కర్ణాటక లోని కుర్తికి కెనరా బ్యాంక్‌లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాడు.
ఇటీవలే ఆయన హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. బుధవారం తెల్లవారుజామున భాస్కర్‌తో పాటు ఆయన భార్య పవిత్ర, కొడుకులు అభిరామ్, ప్ర వీన్, కూతురు జ్యోష్ణతో కలిసి కర్ణాటకలోని మురుడేశ్వర్ దేవాలయానికి దైవ ద ర్శనానికి బయల్దేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భాస్కర్, పవిత్ర, జ్యోష్ణ, అభిరామ్‌తో పాటు కారు డ్రైవర్ శివప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. పదేళ్ల బాలుడు ప్రవీన్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం వారి ఇంటి దగ్గర తల్లి ఉషేనమ్మ మాత్రమే ఉన్నది. డెడ్ బా డీలను తీసుకొచ్చేందుకు బంధువులు సంఘటన స్థలానికి తరలివెళ్లారు.
అతి వేగంతో కా రు డిసిఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం హ యత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజుగౌడ్ తెలిపిన వివరా ల ప్రకారం…. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి కు మారుడు చంద్రసేనారెడ్డి (24) డిగ్రీ పూర్తి చేశా డు. చుంచు జంగారెడ్డి కుమారుడు చుంచు వర్శిత్‌రెడ్డి (23) విద్యార్థి, చుంచు శ్రీనివాస్‌రెడ్డి కు మారుడు చుంచు త్రినాధ్‌రెడ్డి (24), ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్‌రెడ్డి (24 ) నలుగురు కలిసి స్కోడా కారు ఎంహెచ్ 02 డిజి 0771లో మంగళవారం రాత్రి పెద్ద అంబర్‌పేట్‌లోని ఓ రిసెప్షన్‌కు వెళ్లారు. తిరిగి అక్కడి నుండి ఉప్పల్ నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షే త్రం వద్ద రాత్రి గడిపారు.
బుధవారం ఉదయం తెల్లవారు జామున నారపల్లి నుండి కుంట్లూర్‌కు ఇంటికి తిరుగు ప్రయాణంలో కుంట్లూర్ వద్ద అ తి వేగంతో డిసిఎం టిఎస్ 07 యుకే 2664 కుం ట్లూర్ నుండి పసుమాములకు వెళుతున్న డిసిఎంను కారు అతివేగంతో ఢీకొట్టడంతో కారులో ఉన్న చంద్రసేనా రెడ్డి, వర్శిత్‌రెడ్డి, త్రినాథ్‌రెడ్డి అ క్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలై న పవన్‌కళ్యాణ్‌రెడ్డిని హయత్‌నగర్ సన్‌రైజ్ అసపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వా రసులను కోల్పోయిన మూడు కుటుంబాలు గుం డె పగిలేలా రోదించడంతో అందరిని కంటతడి పె ట్టించాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రె డ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు క్యా మ మల్లేష్ హాజరై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి నివాళులు అర్పించారు.