Saturday, May 3, 2025

విజయవాడ-విశాఖ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ-విశాఖపట్నం నగరాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం రెండు నగరాల మద్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు మంత్రి బోర్డింగ్ పాసులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News