కొత్త ఢిల్లీ / బెంగళూరు: అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీదారు అయిన ఎస్బిఐ, భారతదేశపు స్వదేశీ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్, ఉమ్మడిగా ‘ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్’ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. చల్లా శ్రీనివాసులు శెట్టి, చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), అశ్విని కుమార్ తెవారి, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్బిఐ సమక్షములో ఈ ఏకైక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ప్రవేశపెట్టబడింది. బుద్ధికుశలత కలిగిన వినియోగదారులకు వారి కొనుగోళ్ళపై ఒక ఆనందాన్ని ఇచ్చే షాపింగ్ అనుభవాన్ని అందించుటకు, జాగ్రత్తగా ఎంపిక చేయబైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలతో ఈ ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ అత్యంత శ్రద్ధగా రూపొందించబడింది. ఈ ప్రారంభము కొనుగోలుదారులకు వారి షాపింగ్ ప్రయాణాన్ని మెరుగుపరుస్తూ, అధిక విలువ, అనుకూలత మరియు అధికారిక క్రెడిట్ కు ప్రాప్యతలను అందించుటకు ఎస్బిఐ కార్డ్ మరియు ఫ్లిప్‌కార్ట్ యొక్క కొనసాగే ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. వినియోగదారులు ఎస్బిఐ కార్డ్ వారి వెబ్సైట్ SBI Card.com ను సందర్శించి డిజిటల్ గా క్రెడిట్ కార్డ్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాప్ మరియు ఎస్బిఐ కార్డ్ స్ప్రింట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ తో, వినియోగదారులు మింత్ర పై ఖర్చు చేసిన దానిలో 7.5% మరియు ఫ్లిప్‌కార్ట్, షాప్సి మరియు క్లియర్‌ట్రిప్ పై ఖర్చుల పై 5% క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ఎకోవ్యవస్థ పై ఉన్న, మొబైల్స్, ఎలెక్ట్రానిక్స్, సరుకులు, ఫ్యాషన్, ఫర్నీచర్, ఉపకరణాలు, హోమ్ ఫర్నిషింగ్స్, ప్రయాణాల బుకింగ్స్ మరియు మరెన్నో విస్తృతమైన ఉత్పత్తులు మరియు సేవలను కొనుగోలు చేయుటకు ఈ బహుమతి విలువ ప్రతిపాదనను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు జొమాటో, ఊబర్, నెట్‌మెడ్స్ మరియు పివిఆర్ వంటి ఎంపిక చేయబడిన బ్రాండ్స్ పై 4% క్యాష్‌బ్యాక్ మరియు అన్ని ఇతర అర్హత ఉన్న ఖర్చుల పై 1% అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా అందుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ సదుపాయము యొక్క ఆటో-క్రెడిట్ తో వస్తుంది, తద్వారా అర్హత ఉన్న క్యాష్‌బ్యాక్, ఎస్బిఐ కార్డ్ అకౌంట్ లోకి ఆటోమాటిక్ గా క్రెడిట్ అవుతుంది మరియు సమస్యా-రహితమైన అనుభవాన్ని ఇస్తుంది.
సలిల పాండే, మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్, ఎస్బిఐ కార్డ్, ఇలా అన్నారు, “ఎస్బిఐ కార్డ్ వద్ద మేము మా వినియోగదారుల అవసరాలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే ఉత్తమమైన ఉత్పత్తులను అందించుటకు నిరంతరం కృషి చేస్తాము. ఫ్లిప్‌కార్ట్ తో భాగస్వామ్యతో ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ కార్డ్ ఈ దిశగా మరొక ముందడుగు. భారతదేశములో ఈ-కామర్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యములో, వినియోగదారులు ప్రతి కొనుగోలు పై అంతరాయము లేని మరియు బహుమతులు అందుకునే అనుభవాలను కోరుకుంటున్నారు. ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ కార్డ్ ఒక బహుమతి అందుకునే మరియు అంతరాయము లేని చెల్లింపు అనుభవాన్ని అందించుటకు ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.”
కల్యాణ్ కృష్ణమూర్తి, చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, ఇలా అన్నారు, “ఫ్లిప్‌కార్ట్ వద్ద, మేము ఎప్పుడు చేసిన ప్రతిదానిలో వినియోగదారుడికే ప్రాధాన్యత ఇచ్చాము. విస్తృతమైన ఎకోవ్యవస్థ కొరకు ఒక విలువను సృష్టించుటపై మా దృష్టి కేంద్రీకరించాము. కొన్ని సంవత్సరాలుగా, మేము అనేక నూతన ఆర్ధిక ఆఫర్స్ ను ప్రవేశపెట్టాము. ఎస్బిఐ కార్డ్ తో భాగస్వామ్యముతో ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఆ ప్రయాణములో మరొక ముఖ్యమైన మైలురాయి. ఇది భారతదేశములో అధికారిక క్రెడిట్ కు ప్రాప్యత యొక్క ప్రజాస్వామికీకరణ మరియు విస్తరణ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. గరిష్ఠ విలువను అందించుటకు రూపొందించబడిన పరిష్కారాలతో, మేము భారతదేశములోని లక్షలాది కుటుంబాలకు తమ ఆకంక్షలను నిమ్మకముతో నెరవేర్చుకొనుటకు సాధికారత ఇవ్వాలనే లక్ష్యం కలిగి ఉన్నాము.”
ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ కార్డ్ యొక్క ప్రవేశ మరియు వార్షిక రెనివల్ ఫీజు రూ. 500 ప్లస్ వర్తించే పన్నులు. విజయవంతంగా దరఖాస్తు చేసిన తరువాత, కార్డ్హోల్డర్స్ రూ. 1,250 విలువైన స్వాగత ప్రయోజనాలను అందుకోవచ్చు. అదనంగా, కార్డ్ సభ్యత్వ సంవత్సరములో వార్షికంగా రూ. 3,50,000 ఖర్చు చేస్తే రూ. 500 రెనివల్ ఫీ రివర్సల్ ను అందుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ ఒక స్టేట్మెంట్ సైకిల్ లో 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీని కూడా అందిస్తుంది. మాస్టర్‌కార్డ్ మరియు వీసా చెల్లింపు ప్లాట్ఫార్మ్స్ పై ఈ కాంటాక్ట్‌లెస్ కార్డ్ అందుబాటులో ఉంది.
ఈ ప్రారంభానికి గుర్తుగా, ఫ్లిప్‌కార్ట్ మరియు ఎస్బిఐ కార్డ్ ఒక పరిమిత-కాల ప్రారంభ ఆఫర్ ను ప్రవేశపెట్టి, దరఖాస్తుదారులు ఫ్లిప్‌కార్ట్ యాప్ పై కార్డ్ దరఖాస్తు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ప్రతిరోజు 10 శాంసంగ్ గ్యాలక్సీ స్మార్ట్‌వాచెస్ మరియు 100 ఆంబ్రేన్ వైర్లెస్ పవర్ బ్యాంక్స్ గెలుచుకునే అవకాశాన్ని ఇస్తోంది.