Thursday, August 28, 2025

గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు మనకు కీలకం: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణ వాయువు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని అన్నారు. సిఎం, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుంచి కామారెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బయలు దేరారు. కామారెడ్డిలో ముంపు పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టు కు మధ్య తేడా ఉందని, ఇంజనీరింగ్ నిపుణులు చెప్పిన చోట ఎల్లంపల్లిని నిర్మించారని తెలియజేశారు.

నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబండిందని కొనియాడారు. గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి మనకు కీలకమని అన్నారు. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం వెళ్తామని, మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకే రకంగా కట్టారని పేర్కొన్నారు. 3 బ్యారేజీల్లో నీటినిల్వ, ఎత్తిపోత క్షేమం కాదని ఎన్డిఎస్ఎ చెప్పిందని, నిర్మాణం, నిర్వహణలో లోపం ఉందని నిపుణుల కమిటీ చెప్పిందని అన్నారు. నీరు నిల్వ చేశాక మొత్తం కూలిపోతే.. గ్రామాలు కొట్టుకు పోతాయని, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News