ములుగు జిల్లా, వాజేడు మండలం, చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం భారీ వర్షాలతో పొంగిపొర్లుతోంది. జలపాతం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అనుమతించడం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే, దూర ప్రాంతాల నుండి బొగత జలపాతం అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులు అధికారుల నిర్ణయంతో నిరాశగా వెనుదిరగక తప్పడం లేదు. జలపాతం వద్ద భద్రతా చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయమై ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ చంద్రమౌళి మాట్లాడుతూ.. వర్షాలు తగ్గుముఖం పట్టి, బొగత జలపాతం ఉదృతి తగ్గే వరకు పర్యాటకులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రత దృష్టా ఈ ఆంక్షలు కొనసాగుతాయనితెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత పరిస్థితిని అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇబ్బంది పడకూడదని, అధికారులకు సహకరించాలని కోరారు.
పొంగిపొర్లుతున్న బొగత జలపాతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -