Saturday, July 12, 2025

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు కొనసాగుతున్న వరద ఉధృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇన్ ఫ్లో 1,37,635 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మూడు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 1100 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటి మట్టం 547.60 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి. కొనసాగుతుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News