- Advertisement -
అమరావతి: తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వర స్వామి..ఒంటిమిట్ట ఆలయంతో పాటు మిగతా ఆలయాలు అభివృద్ధి చేస్తామని ఎపి టిటిడి ఈఓ శ్యామలరావు (EO Shyamala Rao) తెలిపారు. అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. ఈ ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. ఈఓ శ్యామలరావు, ఆలయాల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని 48 అతిధి గృహాల పేర్లు మార్పు జరుగుతుందని అన్నారు. బిగ్, జనతా కాంటీన్స్ కి త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా స్విమ్స్ అభివృద్ధి చేస్తామని, స్విమ్స్ లో 597 పోస్టుల భర్తీ జరుగుతుందని ఈఓ శ్యామలరావు పేర్కొన్నారు
- Advertisement -