నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. స్నేహితులు, కుటుంబంతో కలిసి సరదాగా హోటల్ కు వెళ్లి నచ్చిన ఆహారాన్ని తినాలంటేనే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కలిషిత ఆహారం పెట్టి.. డబ్బులు దండుకోవడమే తప్ప.. కస్టమర్ల ఆరోగ్యం గురించి మాకేందుకు అన్నట్లు హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నాయి. ఈక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్ పై కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నగరంలోని పలు పిస్తా హౌస్ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. మొత్తం 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి 23 చోట్ల శాంపిల్స్ సేకరించిన అధికారులు.. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని తేల్చారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం..కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక, హోటల్ నిర్వాహకులు.. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు, తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో నగరంలోని పలు రెస్టారెంట్, హోటల్స్ తనిఖీ చేసిన అధికారులు.. నిర్వాహకులు శుభ్రతను పాటించకుండా, కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి, చికెన్, తదితర కలుషిత ఆహారాన్ని కస్టమర్లకు పెడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు.
హోటల్స్ లో తింటున్నారా?.. జాగ్రత్త: ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -