Saturday, May 10, 2025

భయాందోళనలో విదేశీ క్రికెటర్లు?

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్‌పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపిఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న విదేశీ క్రికెటర్లలో ఆందోళన నెలకొంది. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ ఇప్పటికే ఐపిఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఇదిలావుంటే ఐపిఎల్‌లో ఆడేందుకు భారత్‌కు వచ్చిన విదేశీ క్రికెటర్లలో భయం వాతావరణం ఏర్పడింది. ఎప్పుడూ ఏ జరుతుందోనని భయపడుతున్నారు. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియాకు చెందని ఎక్కువ మంది క్రికెటర్లు వివిధ జట్ల తరుఫున ఆడుతున్నారు.

ప్యాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, టిమ్ డేవిడ్, ట్రావిస్ హెడ్, స్టార్క్, స్టోయినిస్ తదితర ఆస్ట్రేలియా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతేగాక ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఐపిఎల్‌లో ఆడుతున్నారు. ప్రస్తుతం వీరందరిలో భయం నెలకొంది. సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి వెళ్లి పోవాలనే ఆలోచనలో వీరున్నట్టు తెలుస్తోంది. కాగా, బిసిసిఐ టోర్నమెంట్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు తమ తమ దేశాలకు వెళ్లిపోతారా లేకుంటే భారత్‌లోనే ఉంటారా అనే దానిపై స్పష్టత రావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News