Wednesday, May 14, 2025

థాయిలాండ్ కు పరారైన బంగ్లా మాజీ ప్రెసిడెంట్

- Advertisement -
- Advertisement -

దేశంలో సంచలనం, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం

ఢాకా:  బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ (Former Bangladesh president Abdul Hamid) గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కట్టుబట్టలతో థాయిలాండ్(Thailand) కు బయలుదేరి వెళ్లిపోయారు. షేక్ హసీనా సర్కార్ పతమనైన తర్వాత దేశం నుంచి అవామీలీగ్ కు చెందిన సీనియర్ నాయకుడు దేశం విడిచి పోవడం ఇదే ప్రథమం. ఒక హత్యకేసులో నిందితుడుగా ఉన్న హమీద్ (Former Bangladesh president Abdul Hamid) దేశం విడిచి ఎలా వెళ్లారన్నది సంచలనంగా మారింది. అసలు ఆయన వెళ్లేందుకు ఎవరు అనుమతి ఇచ్చారన్న దానిపై ఉన్నతస్థాయి దర్యాప్తు మొదలైంది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంతో మాజీ ప్రెసిడెంట్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

మొహమ్మద్ అబ్దుల్ హమీద్ ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్ లాండ్ (Thailand) ఎయిర్ వేస్ విమానంలో కేవలం లుంగీ, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కళ్లుతెరిచి ఏం జరిగిందో గుర్తించిన వెంటనే పలువురు అధికారులను సస్పెండ్ చేసి ఉన్నతస్థాయి దర్యాప్తు కు ఆదేశించింది. అబ్దుల్ హమీద్ 2013 నుంచి 2023 వరకూ రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2024లో ఆందోళన సమయంలో షేక్ హసీనా, ఆమె సహాయకులపై నమోదైన ఓ హత్యకేసులో ఆయన సహనిందితుడు. నిరసనకారులపై హసీనా సర్కార్ కాల్పులు జరిపి ఒకరిని చంపిందనే ఆరోపణలు ఉన్నాయి. హమీద్ తన సోదరుడు, తన బావమరిదితో కలిసి, వైద్యం కోసం వెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. లుంగీ కట్టుకుని వీల్ చైర్ లో ఉన్న హమీద్ విమానాశ్రయంలో ఉన్న సిసిటివి కెమెరాల వీడియోలు వైరల్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News