Wednesday, July 16, 2025

ఎసిబి కస్టడీలో మాజీ ఇఎన్సీ మురళీధర్ రావు.. భారీగా అక్రమ ఆస్తులు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటి పారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావును ఎసిబి అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో మురళీధరరావునివాసంలో మంగ ళవారం తెల్లవారుజాము నుంచి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయనను ఎసిబి అధికారులు అరెస్ట్ చేసినట్టు సమా చారం. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాలలో పది చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. మురళీధర్ రావుకి సంబంధిం చిన కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో భారీగా అక్రమ ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మురళీధర్‌రావు కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టుల కేటా యింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఎసిబికి ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా ఎసిబి అధికారులు జరిపిన సోదాలలో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభిం చినట్లు సమాచారం. ఇలా ఉండగా మాజీ ఇఎన్సీ మురళీధర్ రావును ఇటీవల కాళేశ్వ రం కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణలో మురళీధర్‌రావును అడిగిన ప్రశ్నలకు, తనకు తెలియదని, మర్చిపోయానంటూ సమాధానం చెప్పారు. ఇక విజిలెన్స్ నివేదికలోనూ మాజీ ఇఎన్సీ మురళీధర్ రావు పేరును చేర్చించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మురళీధర్‌రావు పదవీవిరమణ పొందగా, ఆ తర్వాత ఆయన పదవీకాలాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొంతకాలం పాటు పదవిలో ఉన్నారు. మేడిగడ్డ కుంగిపోయిన ఘటన పై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై ఎసిబి కూడా రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఈ క్రమంలో కాళేశ్వ రం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపైన దృష్టిసారించిన ఎసిబి ఇప్ప టికే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా పని చేసిన నూనె శ్రీధర్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఇఎన్సీ మురళీ ధర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన ఉన్నారన్న అభియోగంపై ఆయన్ను తాజాగా అదుపులోకి తీసుకుంది.
మురళీధర్‌రావుది కీలక పాత్ర
కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి, అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అనేక మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. విజిలెన్స్ శాఖ విచారణ అనంతరం 17 మందిపై చర్యలకు సిఫార్సు చేయగా అందులో మాజీ ఇఎన్సీ మురళీధర్‌రావు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News