Sunday, August 31, 2025

ఉక్రెయిన్ మాజీ స్పీకర్ పరుబి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఆండ్రీ పరుబిని శనివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.ఈ ఘటన లివివ్ నగర శివార్లలోని ఫ్కాంకివికియిలో జరిగింది. ఇది అత్యంత క్రూరమైన హత్య అని ఉక్రెయిన్ అధ్యక్షులు ఈ చర్యను ఖండించారు. ఆయన మృతిని నిర్థారించారు. స్థానిక వార్తా సంస్థల కథనం ప్రకారం మధ్యాహ్నం ఈ హత్య జరిగింది. పరూబి ఉక్రెయిన్ దేశ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించారు. యూరోమైడన్ రెవెల్యూషన్‌లో చురుగ్గా వ్యవహరించారు.

రష్యాతో సన్నిహిత సంబంధాలుండాలనే కొన్ని శక్తులను ఆయన తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. తమకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓ రాజకీయ ప్రముఖుడిని ఎవరో కాల్చి వేశారని చెప్పారని, తాము అక్కడికి వెళ్లగా ఆయన మాజీ స్పీకర్ అని నిర్థారించామని లివిన్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేత కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు జెలెన్‌స్కీ ఓ ప్రకటన వెలువరించారు. ఘటనపై వెంటనే పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు, హంతకుల కోసం పోలీసు యంత్రాంగం గాలిస్తున్కనట్లు జెలెన్‌స్కీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News