Monday, June 2, 2025

వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి

- Advertisement -
- Advertisement -

వైరా మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత బాణోత్ మదన్‌లాల్‌ మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. మదన్‌లాల్‌ మరణం పట్ల మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మదన్‌లాల్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి వైసిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్‌లాల్‌… అనంతరం బిఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి మదన్‌లాల్‌ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News