Wednesday, August 20, 2025

ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా.. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.  ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, డిస్ట్రిక్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సిఎం రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు. శంకుస్థాపనకు (foundation) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని, 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి 62 శాతం ఆదాయం వస్తుందని తెలియజేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇబ్బందులు ఉండకూడదనే అన్ని సదుపాయాలతో ఆఫీసులు నిర్మిస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News