Sunday, August 10, 2025

వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నాం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనేక దశాబ్దాల నుంచి రైతులు నీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. తమకు నీళ్లు రావట్లేదని గతంలో ఈ ప్రాంత ప్రజలు పాలకులను వేడుకున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా మధిర వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ..ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేందుకు గానూ వృథాగా పోతున్న నీటిని (Wasted water) వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని, పని చేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని అన్నారు. నాగార్జున సాగర్ కెనాల్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News