- Advertisement -
కారు లాక్ పడడంతో నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపైన తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎంత వెతికిన కనిపించలేదు. చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారులున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభించారు. సరదాగా ఆడుకునేందుకు కారులోనికి వెళ్లగా లాక్ పడడంతో ఊపిరాడక చిన్నారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఉదయ్(8), చారుమతి(8), చరిష్మా(6), మనస్వి గా గుర్తించారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మృతి చెందడంతో ద్వారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -