Tuesday, August 12, 2025

శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. మంగళవారం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ వైపు లక్షా 8 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 65 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా మొత్తం లక్షా 78 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ఎగువ జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 52 వేల క్యూసెక్కులు, హంద్రీ నది ద్వారా 5 వేల 640 క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ నుంచి 1 లక్ష 5 వేల క్యూసెక్కులు చేరుతుండగా జూరాల పది గేట్లను ఎత్త్తి శ్రీశైలం వైపు 68 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 36 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి సుంకేసుల బ్యారేజీకి 60 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 13 గేట్లను ఒక మీటర్ చొప్పున ఎత్తి శ్రీశైలం వైపు వదులుతున్నారు. వరద మరో వారం రోజుల పాటు ఇదే మోతాదులో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News