Friday, May 2, 2025

కారు-లారీ ఢీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం:  కారు-లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందిన సంఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కోటిలింగాల సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్ జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన వారు కారులో భద్రాద్రి కొత్తగూడెం వెళ్తుండగా ఇల్లందు వద్ద అతివేగంతో లారీ కారుని ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న  నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రతికి తరలించారు. గాయపడిన వ్యక్తి  పరిస్థితి విషమంగా  సమాచారం. మరో ఘటనలో ఇల్లందు మండలం అశోక్ నగర్ వద్ద కార్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఏడాది పాపా మృతి చెందగా, ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News