Sunday, May 4, 2025

ఇంటిపై చెట్టుకూలి తల్లీ, ముగ్గురు పిల్లల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ నగరంతోపాటు ఉత్తరాదిలో శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు సంభవించిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో తెల్లవారు జామున 5 గంటలకు ప్రారంభమై మూడు గంటల పాటు 70 మిమీ వరకు కుంభవృష్టి కురిసింది.వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పనులుంటేనే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో వర్షంతోపాటు ఇసు క తుపాన్ చెలరేగింది. విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మూడు విమానాలను దారి మళ్లించారు. 200 విమానాల రాకపోకలు అలస్యమయ్యాయి. పిడుగుపాటుతోపాటు ఈదురు గాలులు వీచడంతో విమానాల ఆపరేషన్‌కు అంతరాయం కలిగింది. 34 గంటలపాటు తుపాన్ వాతావరణం, భారీ వర్షాలు కురియడంతో వర్షసంబంధ ప్రమాదాలు జరిగాయని ఢిల్లీఫైర్‌సర్వీస్ 100 కాల్స్‌ను రిసీవ్ చేసుకుంది. మధ్యాహ్నానికి నీరు నిల్చిపోయిన ప్రాంతాల నుంచి 100 ఫిర్యాదులు వచ్చాయని పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఆయాప్రాంతాలను నీటిని తొలగించడానికి 150 బృందాలను పంపామని తెలిపింది.

లూటెన్స్ ఢిల్లీ ఏరియాలో 25 చెట్లు కూలాయి. నీరునిల్చిపోయినట్టు 12 ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయినట్టు 22 ఫిర్యాదులు రాగా, వెంటనే వాటిని గంటలోనే పునరుద్ధరించామని టాటాపవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టిపిడిడిఎల్) అధికార ప్రతినిధి చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మధుర ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వాహనదారులు చిక్కుకున్నారు. ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఫరీదాబాద్‌లో వరద నీటిలో సగం మునిగిన కారును బయటకు తీయడానికి స్థానికులు ప్రయత్నించడం కనిపించింది. ఘజియాబాద్‌లో వరదనీటిలో వాహనాలు బారులు తీరి చిక్కుకున్నాయి. ఢిల్లీ లోని నజఫ్‌గడ్‌లో ఈదురు గాలులకు ఇంటిపై చెట్టు కూలడంతో ముగ్గురు పిల్లలు, తల్లి మృతి చెందారు. ఆ మహిళశర్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతానికి అనేక సహాయ బృందాలను పంపామని, శిధిలాల నుంచి ఆ నలుగురిని బయటకు తీశామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి చెప్పారు.

వారిని సమీప ఆస్పత్రికి తరలించగా, అక్కడ వారు మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారని తెలిపారు. ఢిల్లీ మింటో బ్రిడ్జి, ఐటిఒ, ఆర్‌కె పురం లోని మేజర్ సోమనాథ్ మార్గ్, ఖాన్పూర్ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గురుగ్రామ్ సిటీలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే లోని నర్సింగ్‌పూర్ సమీపాన సర్వీస్ లైన్, బసాయి రోడ్, సెక్టార్ 10, ఝార్సా చౌక్, ధన్‌కోట్, ఫిజిల్‌పూర్ చౌక్, వాటికా చౌక్, భఘతవార్‌చౌక్, జాకబ్‌పుర, సదర్‌బజార్, మహావీర్ చౌక్, దుండహెరా, తదితర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News