- Advertisement -
ఎపిలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరో నలుగురు గాయ పడ్డారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. అయితే మృతులు, క్షతగాత్రులంతా కారుమంచి గ్రామంలోని బిసి కాలనీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కారుమంచి నుంచి వినుకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.
- Advertisement -