మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్ ట్రేడింగ్, ఐపిఓ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరస్థులు రూ. 28,76,715లక్షలు ముంచారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన వ్యక్తి(40)కి ఫేస్‌బుక్‌లో సైబర్ నేరస్థులు సంప్రదించారు. తర్వాత బాధితుడిని సైబర్ నేరస్థులు ఎఫ్ 55 ఫార్చూన్ స్కై వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. గ్రూపులో 200మంది సభ్యులు ఉన్నారు. అందులో వస్తున్న మెసేజ్‌లను చూసిన బాధితుడు నిజమని భావించాడు. తాము చెప్పినట్లు ట్రేడింగ్, ఐపిఓ స్కీంలో పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. తమది సెబీ రిజిస్ట్రర్డ్ కంపెనీగా నమ్మించారు. నమ్మిన బాధితుడు నిందితులు చెప్పిన షేర్లలో రూ.25లక్షలు పెట్టుబడిపెట్టాడు. తర్వాత లాభాలు చూపించిన నిందితులు విత్‌డ్రా చేసేందుకు యత్నించినా సాధ్యం కాలేదు.
బ్రోకరేజ్ కింద రూ.3,11,000లు, 20శాతం ట్యాక్స్ కట్టాలని చెప్పడంతో బాధితుడు డబ్బులు పంపించాడు. అయినా కూడా పలు రకాల కరణాలు చెప్పి మళ్లీ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో తాను మోస పోయానని గహ్రించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.