మన తెలంగాణ /నారాయణపేట ప్రతినిధి: లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట గీత మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని శనివారం గీతం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉచిత కిడ్ని మూత్ర సంబంధిత వ్యాధులపై నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 110 మంది పాల్గొన్నారు. ప్రఖ్యత కిడ్ని శస్త్ర చికిత్స నిపుణులు వివేకానంద్ కట్టి పర్యవేక్షణలో చికిత్సలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్ని వ్యాధిగ్రస్తులు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోరాదని, ముఖ్యంగా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు వెంటనే మానెయాలని, జంక్ పుడ్‌కు దూరంగా ఉండాలని, అధిక బరువుతో పాటు షుగర్, బిపిని కంట్రోల్‌లో ఉంచుకోవాలని, నీళ్లు ఎక్కువ తాగాలని సూచించారు.
అంతకుముందు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సరిత హరి నారాయణ్ బట్టడ్, స్త్రీ వైద్య నిపుణురాలు గీత విశ్వనాథ్ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహంచి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ హరి నారాయణ్ బట్టడ్, శస్త్ర చికిత్స నిపుణులు విశ్వనాథ్, కార్యదర్శి సాయినాథ్, కోశాధికారి రాధ సదానంద్ చారి, ఆత్మరాం, ఏడికే శ్రీనివాస్ లాహోటి, భీంచందర్ గౌడ్, కన్న జగదీష్, జనార్ధన్, డాక్టర్ థౌసిప్, రామక్రిష్ణ, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.