మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్
మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం
సుమారు 380 మందికి వైద్య పరీక్షలు, మందులు పంపిణీ
మన తెలంగాణ/ హుస్నాబాద్: మున్సిపల్ ఉద్యోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది సుమారు 380 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి.. మందులు పంపిణీ చేశారు. బిపి, షుగర్, ఈసీజీ, 2డి ఈకో తోపాటు సిపిఆర్ ట్రైనింగ్ సెక్షన్ నిర్వహించారు.కాగా మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో మున్సిపల్ మేనేజర్ సంపత్ రావు, ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, సంజీవ్, శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -