- Advertisement -
కేరళలో నిఫా వైరస్ కేసు బయటపడింది. కేరళ లోని మలప్పురం జిల్లాకు చెందిన 42 ఏళ్ల మహిళలో నిఫా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈనెల 2న ఎన్‌సిఫలిటిస్ లక్షణాలతో ఆస్పత్రిలో ఆమె చేరగా, ఆమె నమూనాలను పుణె లోని ఎన్‌టివి కి పరీక్షకు పంపారు. గురువారం నిఫా వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు. వైరస్ నియంత్రణ చర్యలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జి మలప్పురాన్ని సందర్శిస్తారు. 2018 నుంచి కేరళలో నిఫా వైరస్ నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇదే మొదటి నిఫా కేసు.
- Advertisement -