Monday, May 12, 2025

ఒక్కడుండాలి

- Advertisement -
- Advertisement -

ఒక మిత్రుడు ఉండాలి
గుండెకు హత్తుకునే రక్తమై
కన్నీళ్ళ చెట్టును తెగ నరికే గొడ్డలై
బాధలకు కష్టాలకు బంటునైనప్పుడు
వాటిని ఊడ్చుకుపోయే చల్లని
గాలై రావాలి తెలియక జరిగిన తప్పుకు
లోకం కాకులై పొడుస్తున్నప్పుడు
సమాధానపు కట్టె అయి వెంటుండాలి
తెలియని ఆపద వాగై వెంటేసుకొని
పోతుంటే చెట్టుకొమ్మయి అందాలి
జీవిత సంద్రంపై పడవై సాగుతున్నప్పుడు
తెరచాపై దారి చూపాలి
ప్రాణము నిలిపే గుండె శబ్దమై
వాడు ఉండాలి
వెన్నెల రాత్రులలా సంతోషమై తోడుండాలి
గుడిలో గంటలా, ఆకాశంలో సూర్యుడిలా,
ఆకలిలో అన్నంలా, దాహంలో నీరులా
పసిబిడ్డను వడిలో మోస్తున్న
అమ్మలా ఉండాలి
ఈ ప్రపంచమే చిన్నదైపోదా

  • గుండెల్లి ఇస్తారి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News