Saturday, August 16, 2025

‘ఫ్రెండ్లీ ఘోస్ట్’ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

సుచిన్ సినిమాస్ లిమిటెడ్ బ్యానర్ పై మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్రెండ్లీ ఘోస్ట్. సస్పెన్స్‌తో పాటు కామిడీకి పెద్ద పీట వేస్తూ దర్శకుడు జి.మధు సూధన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ… “మంచి కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఫ్రెండ్లి ఘోస్ట్ సినిమా త్వరలో థియేటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా విజయం సాధించి హీరో రాజేష్, నిర్మాత విశ్వనాథ్, డైరెక్టర్ జి.మధు సూధన్ రెడ్డిలకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ త్వరలో రాబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News